Telugu Jokes on Husband And Wife
![]() |
Telugu Husband and wife jokes |
భార్య అపుడే ఊరు నుంచి వచ్చి
చేతిలోని బ్యాగ్ క్రింద పెట్టి ఇల్లంతా కలియచూసింది...ఇల్లంతా నీట్ గా
ఉంది..వంటింట్లోకి వెళ్ళింది..అక్కడా ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయి..సింక్ లోకి
తొంగి చూసింది..తర్వాత కప్ బోర్డ్ చెక్ చేసింది..అన్నీ క్లీన్ గా నీట్ గా సర్ది ఉన్నాయి.బెడ్ రూమ్ లోకి
వెళ్ళింది..పక్క
బట్టలన్నీ సర్దిఉన్నాయి..
వెంటనే భర్తను కౌగిలించుకుంది..
జలజల కన్నీళ్ళు కార్చింది..
భర్త : ఏమైందీ..!? జర్నీ బాగానే
జరిగింది కదా.. !? ఊర్లో నిన్నెవరూ ఏమీ అనలేదు కదా...!?
భార్య:నవ్వుతూ..ఇవి ఆనంద
భాష్పాలండీ..మన పెళ్ళైన దగ్గరనుంచీ ఇంతవరకూ తెలియదు..మీకు ఇన్ని పనులు
తెలుసనీ...ఇక నాకు దిగులు లేదు..రేపటి నుంచి నేనొక్కదాన్నే ఈ పనులు చేయక్కరలేదు...
భార్యను ఇంప్రస్ చేయాలని ట్రై చేయకండి..పెళ్ళైన అమాయక
భర్తల ప్రయోజనార్దం జారీ చేయటమైనది
No comments: