Telugu jokes in bava bamiridi,Latest jokes funny, - Virus Net Zone

728x90 AdSpace

Telugu jokes in bava bamiridi,Latest jokes funny,

Telugu jokes in telugu,bava bavamaridi jokes in telugu,telugu jokes funny,telugu jokes in telugu,telugu latest funny jokes,jokes funny,telugu jokes com,virusnetzone telugu jokes




బావమరిది : బావా..నీ మొబైల్ ఛా
ర్జింగ్ పెట్టి పడుకోవద్దు.

బావ : ఎందుకు రా..?

బావమరిది: నీ సెల్ ఫోన్ బ్యాటరీ బ్లాస్ట్ అవుతుంది. జాగ్రత్త !!

బావ: ఓరి వెర్రిముఖమా.. అందుకే బ్యాటరీ తీసేసి ఛార్జింగ్ పెట్టుకుంటా.


           ****

రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి పొరపాటున ఓ వెధవను ఇంటర్వ్యూకి పిలిచారు.

ఇంటర్వ్యూ బోర్డ్: రైలు ప్రమాదాలు ఆపటానికి నువ్వు ఏమి జాగ్రత్తలు తీసుకుంటావు?

అభ్యర్థి: చాలా సింపుల్ సార్... రైలు పట్టాలకు స్పీడు బ్రేకర్లు పెట్టిస్తా. .. అంతే !!!



            *****

ఒక పెద్ద వెధవ రైలు పట్టాలపై అడ్డంగా పడుకున్నాడు.

చిన్నవెధవ: ఒరేయ్.. రైలు వస్తే ఏం చేస్తావు ?

పెద్ద వెధవ: ఓరి పిరికిపందా.. కొంచెం సేపు కిందటే నామీద నుండి విమానం వెళ్ళింది. నాకు ఏమీ కాలేదు. ఇక రైలొక లెఖ్ఖా..?



        ******

టీచర్:ఒరేయ్ టింకూ......... 8 లో సగం ఎంతరా...?

టింకూ: అడ్డంగా నరికితే 0; నిలువు గా నరికితే 3 సర్..!!

టీచర్: నిన్ను బాగు చేయటం నాతరం కాదురా..



           ****

చిన్న వెధవ: ఒకవేళ పళ్ళు లేని కుక్క కరిస్తే ఏంచేయాలి?

పెద్ద వెధవ: సూదిలేని సిరంజ్ తో ఇంజక్షన్ చేయించుకోవాలి.



             ***

బావమరిది: OXFORD అంటే ఏమిటి బావా..?

బావ: 
OX అంటే ఎద్దు.
FORD అంటే బండి.

కాబట్టి OXFORD అంటే ఎద్దుల బండి.



        ******

చిన్న వెధవ: సీనియర్ కీ జూనియర్ కీ తేడా ఏంటి ?

పెద్ద వెధవ: సముద్రానికి దగ్గరగా ఉండేవాడు సీనియర్ (sea+near)

జంతుప్రదర్శనశాలకు దగ్గర గా ఉండేవాడు జూనియర్
(zoo+near)



                   ****

టీచర్: నారు పోసినవాడే నీరు పోస్తాడు ..అనే సామెతకు అర్థం చెప్పు.

స్టూడెంట్: పాఠాలు నేర్పిన వాడే ఎగ్జామ్స్ వ్రాస్తాడు.



       ****
బావమరిది: బావా.. నాకు పదిరూపాయలు కావాలి ఇవ్వు. రేపు తిరిగి ఇచ్చేస్తాను.

బావ:ఇప్పుడు లేవురా. రేపుతీసుకో.
బావమరిది: రేపుఎలా ఇస్తావు ?

బావ: రేపు నువ్వే ఇస్తానన్నావుగా.......!!!



         ****

బావమరిది: నిన్న రాత్రి కరెంటు పోవటంవలన నేను రెండు గంటలపాటు లిఫ్ట్ లో ఉండిపోవల్సి వచ్చింది.

బావ: నా బాధముందు నీబాధ ఎంతరా..? నేనైతే కరెంట్ లేక నాలుగు గంటలు ఎస్కలేటర్ మెట్లమీదే ఉండిపోయా.


          .****

ఒక తింగరోడు విమానం లోని పైలట్ ఉన్న కాక్ పిట్ లోకి దూకుడుగా ప్రవేశించాడు.

పైలట్(అసహనంతో) అడిగాడు. 
ప్రయాణీకులు మాదగ్గరకు రాకూడదని తెలియదా ?

తింగరోడు: అరేయ్ జఫ్ఫా !!! ముందు నువ్వు విమానం సరిగ్గా నడుపు. హెడ్ ఫోన్స్ లో పాటలు తర్వాత వినొచ్చు.

Telugu jokes in bava bamiridi,Latest jokes funny, Reviewed by Srinivasa Reddy on July 11, 2017 Rating: 5 Telugu jokes in telugu,bava bavamaridi jokes in telugu,telugu jokes funny,telugu jokes in telugu,telugu latest funny jokes,jokes funny,telu...

No comments: