Wife and Husband funny jokes on Telugu - Virus Net Zone

728x90 AdSpace

Wife and Husband funny jokes on Telugu

Telugu jokes ,funny jokes,jokes latest,telugu jokes very funny,





అప్పుడే స్నానం చేసి బెడ్ రూం లోకి వచ్చాడు భర్త.
మంచం మీద తాపీగా కూర్చుని వున్న భార్య ని చూసి... 
భర్త:- యేమిటీ! ఇంత ఆనందంగా వున్నావ్?
భార్య:- తీసేసానండీ. (నవ్వుతూ) 
భర్త:- ఏమి తీసేసావ్?
భార్య:-మీ సెల్ ఫోన్ వాట్సప్ లో మిమ్మల్ని "వైరస్" గ్రూప్ నుంచి తీసేసాను.
భర్త:- నీ బొంద అది “VIRUS” గ్రూప్ కాదే “VIRA’S” గ్రూప్. వీర రాఘవయ్య స్కూల్. అది మా టెంత్ క్లాస్ బ్యాచ్ మేట్స్ గ్రూప్. 
భార్య:-ఏమో నాకేమి తెలుసు? మొబైల్ లో వైరస్ వుండకూడదు కదా! అందుకని తీసేసాను.
భర్త:-ఇంకా ఏమి తీసేసావ్?
భార్య:- “N.V.” గ్రూప్ నుంచి కూడా తీసేసాను.
భర్త:- ఓసి నీ మొఖం మండా !!! “N.V.” అంటే “నూకల వెంకటరత్నం కాలేజ్”. అది మా ఇంటర్ బ్యాచ్.
భార్య:-ఏమో నాకేమి తెలుసు? నాన్ వెజ్ జోకులు వుండకూడదు కదా! అందుకని తీసేసాను.
భర్త:-అంతేనా ఇంకా ఏమన్నా తీసేసావా?
భార్య:-"గాలి" గ్రూప్ నుంచి కూడా తీసేసాను. 
భర్త:- ఓసి నీ అయ్యా అది !!! “గాలి చిన వెంకటేశ్వర్లు కాలేజ్”. అది మా ఇంజినీరింగ్ బ్యాచ్. 
భార్య:-ఏమో నాకేమి తెలుసు? గాలి కబుర్లు చెప్పుకోకూడదు కదా! అందుకని తీసేసాను. 
భర్త:-ఓసి నీ సిగ తరగా!!! అసలు ఇవన్నీ చేయటానికి నీకు నా మొబైల్ పాస్ వర్డ్ ఎలా దొరికింది? 
భార్య:-మీ పేరు పెట్టా, నా పేరు పెట్టా, మీ అమ్మ పేరు పెట్టా, మీ నాన్న పేరు పెట్టా, మన అమ్మాయి పేరు పెట్టా, ఎన్ని ట్రై చేసినా కుదరలేదు.
భర్త:- మరి ఎలా తెరిచావే తల్లీ?
భార్య:-చివరి ప్రయత్నంగా మన పని మనిషి "సుందరి" పేరు నొక్కా!!! దెబ్బకి తెరుచుకుంది రా సచ్చినోడా ....
Wife and Husband funny jokes on Telugu Reviewed by Srinivasa Reddy on July 11, 2017 Rating: 5 Telugu jokes ,funny jokes,jokes latest,telugu jokes very funny, అప్పుడే స్నానం చేసి బెడ్ రూం లోకి వచ్చాడు భర్త. మంచం మీద తాపీగా కూ...

No comments: