త్వరలో సుకుమార్ తో మరో సినిమా చేయబోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు - Virus Net Zone

728x90 AdSpace

త్వరలో సుకుమార్ తో మరో సినిమా చేయబోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు


భరత్‌ అనే నేను సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్న సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు 
మరో సినిమాను కన్ఫామ్ చేశాడు. త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్న మహేష్ ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా కన్ఫామ్ చేశాడు. సుకుమార్‌ దర్శకత్వంలో తన 26వ సినిమా చేసేందుకు అంగీకరించాడు మహేష్‌.

గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన వన్‌ నేనొక్కడినే ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా టెక్నికల్‌గా ఆకట్టుకోవటంతో మరోసారి సుకుమార్‌తో కలిసి పనిచేసేందుకు ఓకె చెప్పాడు మహేష్. ఇటీవల సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రంగస్థలం సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మహేష్‌, సుకుమార్‌ ల కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాను నిర్మించనుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

త్వరలో సుకుమార్ తో మరో సినిమా చేయబోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు Reviewed by Srinivasa Reddy on April 22, 2018 Rating: 5 భరత్‌ అనే నేను సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్న సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు  మరో సినిమాను కన్ఫామ్ చేశాడు. త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వం...

No comments: