సుప్రీం కీలక వ్యాఖ్యలు :
కలిసి ఉండటానికి పెళ్లి కావాల్సిన అవసరం లేదు
భారతీయ వివాహ చట్టం.. ఆడ,
మగ కలిసి ఉండటంపై కీలక వ్యాఖ్యలు చేసింది
సుప్రీంకోర్టు. ఇద్దరు వ్యక్తులు సహజీవనం చేయటానికి పెళ్లి చేసుకుని ఉండాలి అన్న
నిబంధన ఏమీ లేదని స్పష్టం చేసింది. పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండకూడదు అనటం తప్పని
వ్యాఖ్యానించింది అత్యున్నత న్యాయస్థానం. మేజర్ అయిన జంట పెళ్లి చేసుకోకపోయినా
కలిసి ఉండొచ్చని తెలిపింది. ఆ హక్కు వారికి ఉంటుందని తేల్చిచెప్పింది. గృహ హింస
నుంచి మహిళలకు రక్షణ కల్పిస్తూ 2005లో తీసుకొచ్చిన
చట్టంలో ఈ ప్రస్తావన ఉందన్న సంగతిని గుర్తించాలని కోర్టు గుర్తు చేసింది.
నందకుమార్ – తుషార పెళ్లి కేసులో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్
చేస్తూ.. నందకుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరికి పెళ్లి వయస్సు ఇంకా
లేదని.. అబ్బాయి నందకుమార్ కు ఇంకా 21 ఏళ్లు పూర్తి
కాలేదని.. దీంతో ఆ అబ్బాయి పెళ్లి చెల్లదని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై
సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం చాలా వ్యాఖ్యలు
చేసింది. హిందూ, భారతీయ రాజ్యాంగం ప్రకారం
నందకుమార్ – తుషారలకు పెళ్లికి
చట్టపరమైన వయస్సు లేదు.
అయితే.. 1995 హిందూ వివాహ చట్టం ప్రకారం వారి పెళ్లి రద్దు చేయాల్సిన
అవసరం లేదని అభిప్రాయపడింది. మే 30వ తేదీతో
నందకుమార్ వయసు 21ఏళ్లు పూర్తవుతాయి.. ఈ
క్రమంలో నందకుమార్ – తుషార పెళ్లితో ఒక్కటి
కాకపోయినా కలిసి జీవించే హక్కు ఉంటుందని వెల్లడించింది కోర్టు. కేరళ హైకోర్టు
తీర్పును పక్కనపెట్టిన సుప్రీం.. ఎవరు ఎవరితో కలిసి జీవించాలనే హక్కు వారికి ఉంటుందని
ఆదేశాలిచ్చింది ధర్మాసనం.
No comments: